అంగన్‌వాడీలకు గుడ్డు సరఫరా నిలిపివేత

అంగన్‌వాడీలకు గుడ్డు సరఫరా నిలిపివేత
November 30 19:39 2017
కర్నూలు,
కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా ప్రాంతంలోని అంగన్ వాడీల్లో కోడిగుడ్ల సరఫరా సక్రమంగా సాగడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారంలో భాగంగా అందించే కోడిగుడ్డును ప్రస్తుతం ఇవ్వడం లేదని అంటున్నారు. కోడిగుడ్ల ధరలు ఆమాంతంగా పెరగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. కిరాణా దుకాణాల్లో ఒక్కో గుడ్డు రూ. 7లకు విక్రయిస్తున్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో కాంట్రాక్టర్లు అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్డు సరఫరాను నిలిపివేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నందికొట్కూరు ఐసిడిఎస్‌ ప్రాజక్టు పరిధిలో నెల రోజులుగా అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్డు సరఫరా కావడం లేదు. ఫలితంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదు. రాష్ట్రంలోని నిరుపేద గిరిజన, గ్రామీణ ప్రాంత గర్బిణిలు, బాలింతల కోసం ‘అన్న అమృత హస్తం’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన తల్లులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తోంది.
పౌష్టికాహార లోపంతో ఏ తల్లి కూడా ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంరు. ఈ పథకం ద్వారా గర్భిణులు సంపూర్ణ ఆరోగ్యవంతులైన బిడ్డలకు జన్మనివ్వాలన్న పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. కానీ ప్రస్తుతం పెరిగిన ధరలతో అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు పౌష్టికాహారం అందని పరిస్థితి. దీనికితోడు ఈ కేంద్రాల్లో మెనూ కూడా సక్రమంగా అమలు కావడం లేదు. అన్నఅమృత హస్తం పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు వివిధ రకాల సరుకులు, కోడిగుడ్లు, పాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ధరల పెరుగుదల కారణంగా సరుకులు సక్రమంగా అందకపోవడంతో ఉన్న వాటితోనే సర్దుతున్నారు. గర్భిణులకు, బాలింతలకు 200 మిల్లీమీటర్ల చొప్పున పాలు, అన్నం, పప్పు, కూరలు ఇవ్వాలి. ఆకు కూరలను వారానికి మూడుసార్లు కచ్చితంగా అందజేయాలి. నిత్యం కోడిగుడ్డును ఇవ్వాలి. ప్రస్తుతం కోడి గుడ్డు ధర రూ.7లకు పెరగడంతో కాంట్రాక్టర్లు సరఫరా చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్డు అందేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9684
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author