రూ.1నోటు వ‌చ్చి నేటికి వందేళ్లు 

రూ.1నోటు వ‌చ్చి నేటికి వందేళ్లు 
November 30 19:55 2017
న్యూ డిల్లీ
రూ. 1 నోటు వ‌చ్చి నేటితో వందేళ్లు పూర్త‌యింది. న‌వంబ‌ర్ 30, 1917న ఇంగ్లాండ్‌లో మొద‌టి రూపాయి నోటు అచ్చ‌యింది. దాని మీద బ్రిటీష్ చ‌క్ర‌వ‌ర్తి కింగ్ జార్జ్ 5 బొమ్మ ఉండేది. 1861 నుంచే భార‌త ప్ర‌భుత్వం క‌రెన్సీ నోట్ల‌ను ముద్రిస్తున్న‌ప్ప‌టికీ రూ. 1 నోటు ముద్రణ‌ను 1917లో మొద‌లు పెట్టారు. అప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న రూ. 1 నాణేల్లోని వెండిని మొద‌టి ప్ర‌పంచ యుద్ధ కార‌ణంగా ఆయుధాల త‌యారీకి ఉప‌యోగించ‌డం మొద‌లుపెట్టారు. దీంతో చ‌లామ‌ణి కోసం నాణేల స్థానంలో రూ. 1 నోట్ల ముద్ర‌ణ చేప‌ట్టారు.ఇప్ప‌టికీ రూ. 1 నోట్లు అందుబాటులో ఉన్నాయి. పండ‌గ‌ల్లో, శుభాకార్యాల స‌మ‌యంలో ఈ నోట్ల‌ను బ‌హుమ‌తిగా ఇవ్వ‌డానికి ఉప‌యోగిస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో 100 నోట్లు ఉన్న రూ. 1 నోట్ల క‌ట్ట‌ను రూ. 15,000 పెట్టి కొన‌డానికి సిద్ధంగా ఉంటార‌ని ఆన్‌లైన్ విక్ర‌య‌సంస్థ‌లు అంటున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9690
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author