పాలమూరుపై కక్ష గట్టిన కాంగ్రెస్ నేతలు

పాలమూరుపై కక్ష గట్టిన కాంగ్రెస్ నేతలు
November 30 22:24 2017
హైదరాబాద్,
ఇన్ని సంవత్సరాలు అధికారం లో ఉన్న కాంగ్రెస్ నేతలు తెలంగాణ అభివృద్ధికి ఏం సలహాలు ఇస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. గురువారం నాడు అయనే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నేతల వల్లే తెలంగాణ ఆలస్యమైందని ఇప్పుడు అర్ధమవుతోంది. ప్రభుత్వ పనులను అడ్డుకునే శాఖ ఒకటి గాంధీ భవన్ లో పని చేస్తోందని ఆరోపించారు. వలసల జిల్లా పాలమూరుపై కాంగ్రెస్ నేతలు కక్ష గట్టారు. పిల్లులు కూడా లేని చోట పిల్లులు ఉన్నాయని సాగునీటి ప్రాజెక్టుల పై కాంగ్రెస్ నేతలు కోర్టు కెళ్లారని వ్యాఖ్యానించారు. ఇపుడు మహబూబ్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పూర్తవుతుంటే స్థలం పై కాంగ్రెస్ నేతలు కోర్టుకెళ్లారు. అసలు కాంగ్రెస్ నేతలు మనుషులేనా అని అన్నారు. పేద ప్రజలు మంచి ఇండ్లలో ఉండడం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు. కోర్టు ఆ స్థలం పై స్టే ఎత్తేసింది. ఇప్పటి కైనా కాంగ్రెస్ నేతలు కళ్ళు తెరవాలి.  250 ఎకరాల స్థలం ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ హాయంలో నిర్దారించినందుకు అక్కడ మెడికల్ కాలేజీ కూడా కట్టారు. కోర్టు కెళ్ళి విద్యార్థులకు పేదలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందా అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ లో అందరూ సీఎం అభ్యర్థులే. రాష్ట్రం లో కాంగ్రేస్ శకం ముగిసింది. తీరు మార్చుకోకుంటే ఇపుడున్న సీట్లు కూడా మిగలవని అయన జోస్యం చెప్పారు. చివరకు మెట్రో పై కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. తొలి రోజే 2 లక్షల మంది మెట్రో లో ప్రయానించడం దేశం లోనే రికార్డు. అపుడే చార్జీల తగ్గింపు గురించి మాట్లాడుతారా అని ఎద్దేవా చేసారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెట్రో కట్టాలని అప్పట్లో పీజేఆర్ సూచించినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మెట్రో చార్జీలు నిర్మాణ సంస్థ ఖరారు చేసేలా ఒప్పందం చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వమే అని స్పష్టం చేసారు.  క్రెడిట్ తమదే అంటూ కాంగ్రెస్, టీడీపీ లు పోట్లాడుతున్నాయి. ముందు వారిలో వారె తేల్చుకుని వస్తే క్రెడిట్ ఎవరిదో మేము చెబుతామని అయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9754
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author