చకచకా అమరావతి రోడ్లు

చకచకా అమరావతి రోడ్లు
December 01 13:14 2017
విజయవాడ
అమరావతి నగర రాజధాని నిర్మాణంలో అన్ని ప్రాంతాలను కలిపేలా నిర్మితమవుతున్న రోడ్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగం, ఇప్పటికే కేటాయించిన సుమారు 41 సంస్థల కార్యకలాపాలు ఊపందుకున్న నేపథ్యంలో రోడ్ల ఆవశ్యకత పెరిగిందనే చెప్పాలి. అమరావతిని నేరుగా చేరుకునేలా నిర్మిస్తున్న 18.30 కిలో మీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డుతో సహా 90.48 కిలో మీటర్ల పొడవున 10 ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ 10 ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన 1131 ఎకరాల భూమిలో 991 ఎకరాలు భూ సమీకరణలో సమకూరిన విషయం విధితమే. అయితే సుమారు 3.8 శాతం మేర 43 ఎకరాలు భూ సేకరణ ద్వారా, మరో 2.5 శాతం 29 ఎకరాలను సంప్రదింపుల ఒప్పంద పాలసీ ద్వారా సమకూరింది. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం అవసరమైన భూమిని సేకరించడంలో కోల్పోయే భూమి, వాటిల్లోని నిర్మాణాల సంఖ్య తక్కువ ఉండేలా చేసేందుకు సీఆర్‌డీఏ అధికారులు పూర్తిస్థాయిలో తగు జాగ్రత్తలు తీసుకోవడంతో రోడ్ల నిర్మాణం వలన ప్రభావితమైయ్యే కుటుంబాల సంఖ్య సైతం గణనీయంగా తగ్గింది.రాజధాని నగర రవాణా అవసరాలు ప్రధానమైనవే అయినా వీటి వల్ల నష్టపోయిన వారికి కల్పించే ప్రయోజనాలకు పెద్ద పీట వేయడంతో కొన్ని అవరోధాలు తొలగాయనే చెప్పాలి. ఇళ్లు, ఇతర ఆస్తులు కోల్పోయి నిర్వాశితులయ్యే కుటుంబాలకు సత్వరమే పునరావాస కాలనీలను అన్ని వసతులతో అభివృద్థి చేయాలంటూ సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ అధికారులను ఆదేశించారు. రాయపూడి, నవులూరులలో పక్కా ప్రణాళికాబద్ధంగా ఆయా పునరావాస కాలనీల అభివృద్థి పనులు నిరాటంకంగా సాగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో నిర్వాసితులయ్యే 66 కుటుంబాలకు రాయపూడిలో 3ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్న లే అవుట్‌లో ఇప్పటికే సిమెంట్ రోడ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. విద్యుత్ స్థంభాలు, నీటి సరఫరా, డ్రైన్లను ఏర్పాటు చేస్తున్నారు. కురగల్లు, నిడమర్రు, నవులూరు గ్రామాల మీదుగా నిర్మించే రహదారుల వలన నిర్వాసితులేయ్యే 48 కుటుంబాల పునరావాసం కోసం ఎన్-4 రోడ్డు పక్కనే ఉన్న భూమిని రిజర్వ్ చేశారు. ఈ-14 రోడ్డు ప్రభావితులైన మెజారిటీ వ్యక్తులు పునరావాస కాలనీల్లో ప్లాట్లను తీసుకునేందుకు ఉత్సాహం చూపగా మొత్తం 6.4 ఎకరాల్లో లే అవుట్ ను అభివృద్థి చేస్తున్నారు. సంప్రదింపుల ఒప్పంద పాలసీ పనులన్నీ ప్రయోజనాల్లో భాగంగా ఇల్లు నిర్మాణ విలువకు రెండింతల పరిహారం, నివాస ప్లాటుకు సమాన ప్లింత్ ఏరియా ప్లాటు కేటాయింపు తోపాటు ఏపీ ప్రభుత్వ హౌసింగ్ కార్పొరేషన్ స్కీమ్ ప్రకారం గ్రాంటు కూడా అందజేయడం గమనార్హం. అలాగే పునరావాసానికి వెళ్లే కుటుంబాలకు రవాణా ఖర్చు నిమిత్తం రూ.50వేలను చెల్లిస్తుండగా చిన్న చిన్న పశువుల శాలలు, చిన్న షాపులు పోతే నిర్మించుకునేందుకు గాను మరో రూ.25వేలను అందజేస్తున్నారు. నష్టపరిహారంతోపాటు వీరి జీవన భృతి కింద నెలకు రూ.2,500ల చొప్పున పదేళ్ల వరకూ చెల్లించడం జరుగుతోంది. ఈనేపథ్యంలో పునరావాస ప్రాంతాల అభివృద్థికి ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకపోవడంతో కాలనీల అభివృద్థి పనులు చురుకుగా సాగుతుండటం అభినందనీయమనే చెప్పాలి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9774
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author