అక్కడి రోడ్లు ఇక్కట్లకు నెలవు

అక్కడి రోడ్లు ఇక్కట్లకు నెలవు
December 01 17:04 2017
ప్రకాశం,
ప్రకాశం జిల్లా వెలిగండ్ల ప్రాంతంలోని రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. ఇక్కడ ప్రయాణం కష్టాలమయమని.. పాలకులు ఇటువైపు దృష్టి సారించి రోడ్లను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నాయి. వెలిగండ్ల మండలంలోని నర్సమాంబపురం, బల్లవరం, పద్మాపురం రహదారులైతే ప్రమాదకరంగా మారాయి. దీంతో ఆ రహదారులపై ప్రయాణించాలన్నీ, నడవాలన్నా ప్రజలు భయపడుతున్న పరిస్థితి. మండలంలోని నర్సమాంబపురం గ్రామం బల్లవరం పంచాయతీలో ఉంది. ఈ గ్రామంలో 249 కుటుంబాలు, 1012 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామాల నుంచి విద్యార్థులు హైస్కూల్‌లో చదవాలంటే మొగుళ్లూరుకు రావాల్సిందే. నర్సమాంబపురం, పెరుగుపల్లి, బల్లవరం గ్రామాల నుంచి దాదాపు 60 మంది విద్యార్థులు మొగుళ్ళూరు పాఠశాలకు కాలినడకన 5 కి.మీ. నడచిపోతున్నారు. 12 ఏళ్ల క్రితం నర్సమాంబపురం-బల్లవరం మీదుగా మొగుళ్ళూరు నుంచి కనిగిరి వెళ్ళడానికి ఒక బస్సు ఉండేది. ఈ రెండు గ్రామాల రహదారులు పూర్తిగా శిథిలమ్యయాయి. అంతేకాక చిల్లచెట్లతో రోడ్లు మూసుకుపోయింది. దీంతో ఈ రహదారిలో తిరిగే బస్సును రద్దు చేశారు. బస్సు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు నానాపాట్లు పడుతున్నారు.
ఇతర ప్రాంతాలకు వెళ్లానుకునే వారికి ఆటోలే దిక్కవుతున్నాయి. ధ్వంసమైన రోడ్డుపై ఆటోలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేవరకూ భయాందోళనలతోనే ఉంటున్నాయి. ఇక విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉదయం, సాయంత్రం మొగుళ్ళూరులోని పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. ఇక వృద్ధులు, గర్భిణులు, రోగుల పరిస్థితైతే మరీ దారుణం. బాధితులు వైద్యం కోసం కనిగిరికి వెళ్లడానికి సర్కస్ ఫీట్లే చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు ఈ రోడ్లను తారురోడ్లుగా మారుస్తామని హామిలిచ్చారని..అయితే ఎన్నికలు. ఇంతవరకు ఈ రోడ్లకు మోక్షం కలుగలేదు. వర్షం పడితే మోకాలు లోతు నీళ్ళలో నడవాల్సిందే. క్రికెట్‌ బంతి సైజులో ఉండే కంకర రాళ్ళు రోడ్డుకు ఇరువైపులా ఉండటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ రోడ్లను తారురోడ్లుగా మార్చి ఆయా గ్రామస్తుల కష్టాలను తీర్చాల్సిన అవసరమెంతైనా ఉందని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9859
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author