మోడీ ఫై మరోసారి ఫైర్ అయిన ఎంపీ శత్రుఘ్నసిన్హా 

మోడీ ఫై మరోసారి ఫైర్ అయిన ఎంపీ శత్రుఘ్నసిన్హా 
December 01 17:36 2017
న్యూ డెల్లి
రాజకీయ ప్రత్యర్థులు ఒకరి ఫై ఒకరు విమర్శలు చేసుకోవడం రాజకీయాల్లో మామూలే. వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. న్యూట్రల్ గా ఉండేవారు.. సానుకూలత ప్రదర్శించేవారు.. సొంత పార్టీకి చెందిన వారు విమర్శలు చేయటం.. వేలెత్తి చూపటం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రత్యర్థులతో పాటు సొంతోళ్ల చేత కూడా ప్రధాని మోడీ ప్రశ్నలు సంధించుకుంటున్నారు. తన మాటలతో అప్పుడప్పుడు షాకులు ఇచ్చే బీజేపీ సీనియర్ నేత.. రెబెల్ ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి ఫైర్ అయ్యారు. మోడీపై మాటల దాడికి దిగారు. ప్రశ్నల వర్షం కురిపించారు. దేశంలో నెలకొన్న కీలక అంశాల మీద ప్రధాని ఎందుకు స్పందించరంటూ ప్రశ్నంచారు. దేశాన్ని పీడిస్తున్న రైతుల ఆత్మహత్యలు.. నిరుద్యోగం లాంటి అంశాలపై ప్రధాని తక్షణమే నోరు విప్పాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పద్మావతి చిత్ర వివాదం మీద కూడా మోడీ మాట్లాడాలన్నారు. కీలక అంశాల మీద జాతిని పట్టి పీడిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మార్గదర్శిగా నిలవాలని కోరారు.రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా తన పని తాను అన్నట్లుగా వ్యవహరించే తెలుగు సినీ రంగ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేయటం.. అందులో ప్రధాని మోడీ విధానాల్ని తప్పు పట్టటం తెలిసిందే. తమ్మారెడ్డి ఏ అంశాల్ని ప్రస్తావించారో.. ఇంచుమించు అలాంటి అంశాల్ని శత్రుఘ్న సిన్హా సంధించటం గమనార్హం.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను మౌన ప్రధానిగా అభివర్ణించారని.. మరి నేటి ప్రధాని మోడీ కీలక అంశాల మీద స్పందించి.. జాతిని వేధిస్తున్న సందేహాలకు సమాధానాలు చెప్పాలని కోరుకుంటున్నారు. షాట్ గన్ మాదిరే తమ్మారెడ్డి భరద్వాజ సైతం ఇదే రీతిలో రియాక్ట్ కావటం చూస్తే.. మోడీ మీద అసంతృప్తి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9875
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author