ప్రపంచ తెలుగు మహాసభలకు విస్తృత ఏర్పాట్లు

ప్రపంచ తెలుగు మహాసభలకు విస్తృత ఏర్పాట్లు
December 01 17:52 2017
హైదరాబాద్
డిసెంబర్  15 నుండి 19 వరకు నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతస్థాయి  సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు మహాసభల నిర్వహణపై సమీక్షించారని, వారి ఆదేశాల మేరకు సంబంధిత శాఖలు కార్యచరణ ప్రణాళికలు రూపొందించుకొని పనులు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉత్సవాలలో పాల్గొనడానికి దేశ, విదేశాలనుండి వచ్చే సాహితీ ప్రముఖులకు బస, భోజనం, రవాణా తదితర సౌకర్యాల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఈ మహాసభల కోసం ప్రత్యేక వాలంటీర్లను నియమించుకొని తగు మార్గదర్శకం చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని IAS, IPS, IFS, HODలు, యూనివర్సిటీ విసిలకు ప్రారంభ, ముగింపు వేడుకల్లో పాల్గొనేలా తన తరఫున సర్కిల్ రూపొందించా ల్సిందిగా GAD ముఖ్య కార్యదర్శి  శ్రీ అధర్ సిన్హా  ను సి.యస్. ఆదేశించారు..ఈ వేడులకు ప్రముఖ  క్రీడాకారులను ఆహ్వనించాలని ఆయన సూచించారు. ప్రధాన వేదిక అయిన ఎల్.బి.స్టేడియం లో ప్రదర్శించడానికి దేశంలోని పేరొందిన నిపుణులచే లేజర్ షోను రూపొందించాలన్నారు. హైదరాబాద్ నగరంలో 100 స్వాగత ద్వారాలతో పాటు ఎయిర్ పోర్టు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన ప్రాంతాలలో హోర్డ్ంగ్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖధికారులను ఆదేశించారు. 100 బేలూన్స్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించాలని , టెలివిజన్         చానెల్లలో అడ్వర్ టైజెమెంట్స్, సెల్ ఫోన్ల ద్వారా వాయిస్ మేసేజ్ వంటి ద్వారా ప్రచారం నిర్వహించి మహాసభల పట్ల ప్రజల్లో ఆసక్తిని కల్పించాలన్నారు.బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మ హానగరాల్లో హోర్డింగ్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. భద్రత కు సంబంధించి మహాసభలలో పోలీసు శాఖ కీలకమని ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సంబంధించి ముఖ్యులతో రోజు వారి సమావేశాలు నిర్వహించనున్నట్లు సి.యస్ తెలిపారు. నిపుణులతో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షించాలన్నారు. రాష్టపతి, ఉప రాష్ట్రపతి తో పాటు ఎంతో మంది ప్రముఖలు ఈ మహాసభల్లో పాల్గొంటున్నారని, ప్రధాన వేధికల నిర్మాణానికి సంబంధించి ఆర్. అండ్ బి. తగు చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకల సందర్భంగా ఎల్.బి.స్టేడియంలో ప్రత్యేక బుక్ స్టాల్స్ , ఫుడ్ కోర్ట్, హస్తకళల స్టాల్స్ ఏర్పాటు తో పాటు మంచినీటి సరఫరా కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ అర్. ఆచార్య,  ముఖ్యకార్యదర్శులు అధర్ సిన్హా, సునీల్ శర్మ, రజత్ కుమార్, సి.వి.ఆనంద్, కార్యదర్శులు: బి.వెంకటేశం, సందీప్ కుమార్ సుల్తానియా, జి.హెచ్.యం.సి కమిషనర్ జనార్ధన్ రెడ్డి, వాటర్ బోర్డు యం.డి. దానకిషోర్, పి.సి.బి. సభ్య కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ యం. డి. క్రిస్టినా చౌం గ్త్ , సాట్స్ యం.డి. దినకర్ బాబు, హెచ్. యం.డి.ఎ. కమీషనర్ చిరంజీవులు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్  శ్రీమతి యోగిత రాణా, ప్రోటోకాల్ డైరెక్టర్         అర్విందర్ సింగ్,   హైదరాబద్ సి.పి. శ్రీనివాసరావు, సైబరాబాద్ సి.పి.  సందీప్ శాండిల్య, సి.యం. ఓ.యస్. డి. దేశపతి శ్రీనివాస్, తెలుగు యూనివర్సిటీ వి.సి. సత్యనారాయణ, గ్రంధాలయ సంస్థల చైర్మన్ ఆయచితం శ్రీధర్,  ఆధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్ రావు, సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ  తదితరులు పాల్గొన్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9890
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author