పంటల ఉత్పాదకతను పెంచే దిశగా అధికారులు కృషిచేయాలి 

పంటల ఉత్పాదకతను పెంచే దిశగా అధికారులు కృషిచేయాలి 
December 01 18:30 2017
హైదరాబాద్,
తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయాన్ని లాభదాయకంగా, పంటల ఉత్పాదకతను పెంచే దిశగా వ్యవసాయ సాంకేతికతను మెరుగ్గా వినియోగించే లక్ష్యంతో, వ్యవసాయ అధికారులను పంటల నిపుణులుగా తీర్చి దిద్దడంలో భాగంగా 27 నవంబరు నుంచి 2 డిశంబరు, 2017 దాకా 6 రోజుల శిక్షణా కార్యక్రమమం రాజేంద్రనగర్ లోని ఎక్స్ టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఏర్పాటు చేశారు.  ఈ శిక్షణా కార్యక్రమంలో రెండు బ్యాచులుగా మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.  శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ అధికారులు ఈ శిక్షణా కార్యక్రమంపై తమ అభిప్రాయాలు చెబుతూ – మాకు అనేక అంశాలపై, పంటల వ్యవసాయ సాంకేతికపై, సరికొత్త వ్యవసాయ అంశాలపై అవగాహన కలిగించడంలో ఈ శిక్షణా కార్యక్రమం చాలా ఉపయోగిపడిందని అన్నారు.  6 రోజులు కాకుండా మరి కాస్త ఎక్కువ నిడివితో, మరింత విపులంగా  ఈ శిక్షణా కార్యక్రమం రూపొందిస్తే బాగుంటుదని సూచించారు.  శిక్షణా కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులో ఉన్న ఇతర వ్యవసాయ పరిశోధనా సంస్థలు చూసే అవకాశం కలిగించాలని కోరారు.  ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయ ప్రధాన శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు తమకు చాలా విలువైన విషయాలు చెప్పారని అన్నారు.   శిక్షణా కార్యక్రమంపై విశ్వవిద్యాలయ వైస్-చాన్స్ లర్ డా. వి. ప్రవీణ్ రావు మాట్లాడుతూ రైతులకు సరియైన సమయంలో సరియైన సాంకేతికత, సలహాలు అందించడమే మన రాష్ట్ర  ముఖ్యమంత్రి లక్ష్యమని, అందుకు అనుగుణంగానే వ్యవసాయ సమాచారాన్ని, సాంకేతికతను క్రోడీకరించి అందిస్తున్నట్లు చెప్పారు.  రైతుల విజయగాథలను కూడా ఒక దగ్గర వేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ పంచాంగాన్ని నూతన సమాచారంతో అందించామని చెప్పారు.  తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు అందించడం లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు.  వచ్చిన సూచనలను దృష్టిలో పెట్టుకొని శిక్షణా కార్యక్రమాన్ని మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తామని  డా. రాజారెడ్డి అన్నారు.  వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్. వ్యవసాయ అధికారులను ఉద్దేశించి, శిక్షణా కార్యక్రమం గురించి మాట్లాడుతూ – వ్యవసాయ అధికారులను పంటల నిపుణులుగా మార్చి క్షేత్రస్థాయిలో రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని అన్నారు.  అటువంటి దీర్ఘకాల దృష్టి కలిగిన ముఖ్య.మంత్రికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.  శిక్షణా కార్యక్రమం అందించిన యూనివర్సిటి వి.సి. డా. వి. ప్రవీణ్ రావుకు, డైరెక్టర్ ఎక్స్ టెన్షన్ డా. రాజారెడ్డికి, డా. ఆనంద్ సింగ్, మొత్తంగా శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేసారు.  ఇక్కడ నేర్చుకున్న ప్రతి చిన్న విషయాన్ని రైతులకు అందించినప్పుడే మన వ్యవసాయం బలోపేతం అవుతుందన్నారు.  రైతులకు సేవ చేసే అవకాశం వ్యవసాయ అధికారులకే ఉందన్నారు.  దేశంలోని అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రంలో చేపడుతున్న వ్యవసాయ పథకాలను ఆశక్తితో గమనిస్తున్నాయని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9900
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author