రాజకీయ విధానం మారాలి : టీడీఎన్పీ భేటీలో చంద్రబాబు

రాజకీయ విధానం మారాలి : టీడీఎన్పీ భేటీలో చంద్రబాబు
December 01 18:39 2017
అమరావతి,
సంస్కరణలు వచ్చాక ప్రజల ఆలోచనా విధానం మారిందని, దానికి అనుగుణంగా రాజకీయ విధానం మారాలని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీఎల్పీలో సీఎం మాట్లాడుతూ కమ్యూనిస్ట్‌ పార్టీల వల్ల ఏమీ రాదన్నారు. నేను రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ చేస్తుంటే ఎమ్మెల్యేలు రియల్‌టైమ్‌ పాలిటిక్స్‌ చేయాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేస్తే అధికారం సుదీర్ఘంగా ఉంటుందని సీఎం తెలిపారు. అభివృద్ధి జరిగే వరకూ సాయం కోరుతున్నామని అన్నారు.
పోలవరం నిర్మాణంపై ప్రతి వారం సమీక్ష చేస్తున్నాం. ఏ మాత్రం అలక్ష్యం వహించినా ప్రాజెక్టు నిర్మాణం వెనుకపడుతుంది. కేంద్రం రాసిన లేఖపై గడ్కరీ, ప్రధానితో మాట్లాడుతామని చంద్రబాబు అన్నారు. పోలవరం విషయంలో వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. పోలవరం విషయంలో కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పోలవరం అభివృద్ధితో కూడిన అంశమని, రాజకీయ కోణంలో ఆలోచించవద్దని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు. కేంద్రంలో ఉండే ప్రభుత్వం మనకు సాయం చేయాలని, అభివృద్ధి జరిగే వరకు కేంద్రసాయం కోరాలన్నారు. కేంద్రంపై విమర్శలు చేసేసి ఏదోకటి మాట్లాడొద్దని సీఎం పేర్కొన్నారు. పోలవరం నిర్మాణంపై ప్రతివారం సమీక్ష చేస్తున్నామని, ఏమాత్రం అలక్ష్యం వహించినా నిర్మాణం వెనుకబడుతుందని సీఎం వివరించారు.
గురువారం నాడు  ప్రకాశం జిల్లా నేతల ఘర్షణ పై సీఎం సీరియస్ అయ్యారు. నేతలు పార్టీ పరువు తీస్తున్నారంటూ మండిపడ్డారు. నేను ఎవరికి అన్యాయం చేయలేదు. కొత్త, పాత కలిసి పనిచేయాలని ఎన్నోసార్లు చెప్పా. ఎమ్మల్యేల కు ఇంచార్జి లగా బాధ్యతలు ఇచ్చాక జోక్యం వద్దని స్పష్టం చేసానని అన్నారు. చేరికల వల్ల పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరగకుండా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి గౌరవించా. ఇంతకంటే ఎమ్ చేయాలని అన్నారు. అయినా గొడవలు పడుతూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇలాంటి చర్యలు ఉపేక్షించనని హెచ్చరించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9903
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author