లైన్ క్లియర్ 

లైన్ క్లియర్ 
December 01 19:49 2017
భద్రాద్రి,
ఎట్టకేలకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌ భవన సముదాయానికి దాదాపుగా స్థలం ఖరారైనట్లు సమాచారం. జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 అక్టోబరు 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆవిర్భవించింది. నూతనంగా ఏర్పడిన అన్నీ జిల్లాలకు కొత్తగా కలెక్టరేట్‌ భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన కార్యాలయాలతో, హెలిప్యాడ్‌ సౌకర్యంతో అత్యాధునిక హంగులతో కూడిన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందించారు. దీనికి సంబంధించిన స్థలాను ఎంపిక చేసే బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకే అప్పగించింది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌ స్థలం ఎంపిక విషయంలో పూర్వ ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నేతల మధ్య సఖ్యత కుదరకపోవడం,ఇద్దరు వేర్వేరు స్థలాలు సూచించడంతో జాప్యం చోటు చేసుకుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
 కలెక్టరేట్‌ స్థలం ఎంపిక కోసం త్రిసభ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రెండు నెలల కిందట జిల్లా కేంద్రంలో పర్యటించింది. రామవరం వెళ్లే దారిలో, కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన వారంతపు సంత సమీపంలో సింగరేణి సంస్థకు చెందిన మ్యాగ్జిన్‌ స్థలాన్ని, కొత్తగూడెం నుంచి పాల్వంచకు వెళ్లే మార్గంలో కేఎంఎస్‌ ప్రాంతంలోని నవభారత్‌ వెంకటేశ్వరరస్వామి గుడి పక్కనున్న ‘యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌’కు సంబంధించిన స్థలాన్ని, ఇల్లెందు క్రాస్‌ రోడ్డులోని నర్సరీ స్థలాన్ని పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను, స్థలాల మ్యాప్‌లు, అనుకూలతలను, ప్రతికూలతలకు సంబంధించిన నివేదికను సీఎంకు అందజేశారు.
కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం నిర్మించేందుకు కొత్తగూడెం నుంచి పాల్వంచ మార్గంలోని నవభారత్‌ వెంకటేశ్వరరస్వామి గుడి పక్కనున్న ‘యూవర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌’కు సంబంధించిన స్థలం ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ కలెక్టరేట్‌ ఏర్పాటు చేయడం వల్ల భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, చంద్రుగొండ, జూలూరుపాడు, దమ్మపేట, ఆళ్లపల్లి, గుండాల,పినపాక మండలాల ప్రజల రాకపోకలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎటు నుంచి ఎటు వచ్చినా సరిగ్గా 60 కిలో మీటర్లలోపే దూరం ఉంటుందని వీరు సూచించినట్లు తెలిసింది. కొత్తగూడెం-విజయవాడ-ఇబ్రహీంపట్నం నుంచి జగదల్‌పూర్‌ వరకు నిర్మిస్తున్న 30వ నంబరు జాతీయ రహదారి మార్గం కూడా ఇదే మార్గంలో ఉండటంతో రాకపోకలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని త్రిసభ్య కమిటీ సూచించినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఇదే స్థలాన్ని ఫైనల్‌ చేసినట్లు తెలిసింది.
త్రిసభ్య కమిటీ నివేదినక అందించిన తర్వాత దస్త్రం చకచకా ముందుకు సాగింది. ఇప్పుడున్న అడ్డంకల్లా ఈ స్థలం ‘యూవర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌’ పరిధిలో ఉండడమే. దీంతో కాకతీయ యూనివర్సిటీ బోర్డు అనుమతి కోసం ప్రభుత్వం విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి కలెక్టరేట్‌ స్థలానికి సంబంధించిన దస్త్రాన్ని పంపించారు. యూనివర్సిటీ బోర్డ్‌ అనుమతినివ్వడంతోపాటు నవభారత్‌ వెంకటేశ్వరస్వామి దేవాలయం పక్కనున్న దాదాపు 25 ఎకరాల స్థలాన్ని దీనికి కేటాయించినట్లు సమాచారం.
నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించిన నిర్మాణ నిర్వహణ బాధ్యతలను రహదారులు,భవనాల శాఖకు అప్పగించారు. కలెక్టరేట్‌ భవన సముదాయం 18 ఎకరాల్లో నిర్మిస్తుండగా, మిగిలిన ఏడు ఎకరాల్లో హెలీప్యాడ్‌తోపాటు,భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించనున్నారు. నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేసేలా ప్రభుత్వం,అధికారులు భావిస్తున్నారు. ప్రతిపాదిత స్థలంలో గుట్టలు, చెట్లు ఉండటంతో వాటిని జేసీబీలు, డోజర్లతో యుద్ధప్రాతిపదికన భూమి చదును చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. శనివారం నుంచి భూమి చదును చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9937
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author