పధ్నాలుగు రోజులపాటు సిద్దిపేటలో సాహితీ కార్యక్రమాలు

పధ్నాలుగు రోజులపాటు సిద్దిపేటలో సాహితీ కార్యక్రమాలు
December 01 20:13 2017
సిద్దిపేట,
ఈ నెల 15 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. దేశ విదేశాల నుంచి మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 6 వేల మందికి పైగా నమోదు చేసుకున్నరని మంత్రి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రం శివనుపవా మండపంలొ ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభ సన్నహక సమావేశానికి మంత్రి  ఎమ్మెల్యేలు పాతురి సుధాకర్ రెడ్డి, బోడకుంట్ల వెంకటేశ్వర్లు,  ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రామలింగ రెడ్డి,  జిల్లా కలెక్టర్ వెంకట్రాం రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్‌ను మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ ఈ మహా సభలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఏపీ సీఎం, మహారాష్ట్ర గవర్నర్ హాజరవుతారన్నారు. మహాసభలు నిర్వహించి తెలుగు భాషను ప్రపంచానికి చాటి చెప్పాలని మంత్రి తెలియజేశారు. 14 రోజుల పాటు సిద్దిపేట జిల్లాలో సాహిత్యపరమైన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి అన్నారు. బతుకమ్మ పాటల సంపుటి తీసుకురావడంతో పాటు ఆముద్రిత రచనల ముద్రణ, కవి సమ్మేళనాలు నిర్వహించాలని హరీశ్ రావు సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు హజరుకవాలని ఇప్పటికే 6000మంది రిజిష్టర్ చేసుకున్నారు . ప్రపంచ మహాసభలు నిర్వహించి మన తెలుగు బాషాలు ప్రపంచానికి చాటి చెప్పాలి. దేశ విదేశాల నుండి చాలమంది వస్తున్నారు కావున హైదరబాద్ లొ 100తిర్నాలు కడుతు స్వాగతం పలుకుతున్నమని మంత్రి అన్నారు. సాహిత్యానికి కళాకారులకు పురిటి గడ్డ సిద్దిపేట గడ్డ అని అయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9952
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author