అంబేద్కర్ భవనం శంకుస్థాపన: మంత్రి జగదీశ్వర్ రెడ్డి

అంబేద్కర్ భవనం శంకుస్థాపన: మంత్రి జగదీశ్వర్ రెడ్డి
December 01 22:37 2017
యాదాద్రి భువనగిరి,
గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం రాష్ట్రంలో దళితుల కోసం 17 వేలా 467 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేసిందని Sc కులాల అభివృద్ధి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా శింగన్న గూడెం లో 2 కోట్ల రూపాయల తో నిర్మించనున్న డాక్టర్‌ బి.ఆర్ అంబేద్కర్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.  అంతకు ముందుకు  ఆర్ అండ్ బీ  గెస్ట్ హౌస్ నుండి బ్తెక్ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపం, జగ్జీవన్ రామ్, అంబేద్కర్ విగ్రహంలకు పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు.  అనంతరం శిగన్న గూడెంలో భవనానికి శంఖుస్థాపన చేసి సభలో మాట్లాడుతూ దళితుల సంక్షేమ కోసం ఉద్యమం సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్   మంచి పథకాలు ఆలోచన చేశారని అధికాలోకి రాగానే వాటిని అమలు చేస్తూ న్నారని చెప్పారు.ఇప్పటి వరకు 500 లకు ప్తెగా సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో 30 మహిళల కళాశాలలు వున్నాయి అని అన్నారు.ఈ  కార్యక్రమం లో ఎంపీ  బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ లు  లు కర్రె ప్రభాకర్, కృష్ణా రెడ్డి, ఎమ్మెల్యేలు  ఫ్తెళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, మున్సిపల్ చ్తెర్మన్ సుర్వీ లావణ్య, మార్కెట్ కమిటీ చ్తెర్మన్ పంతులు నాయక్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9958
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author