బస్సు చార్జీలను మించిపోయిన మెట్రో….

బస్సు చార్జీలను మించిపోయిన మెట్రో….
December 02 10:08 2017
హైద్రాబాద్,
హైద్రాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభమైంది. ప్రతి రోజూ సుమారు లక్ష మంది ప్రయాణం చేస్తున్నారని అధికారులు నివేదికలు వెల్లడిస్తున్నాయి.అయితే మెట్రో రైలులో ప్రయాణం చేయడం వల్ల తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరే వెసులుబాటు కలుగుతోంది. అంతేకాదు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం లాంటి సమస్యలు కూడ ఉండవు. బస్సులో అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు, కానీ, ఛార్జీలు మాత్రం తక్కువ. బస్సు ఛార్జీల కంటే మెట్రో ఛార్జీలు ఎక్కువ. గత నెల 28వ, తేదిన మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైద్రాబాద్ మెట్రో రైలు జాతికి అంకితం చేశారు.ఈ మెట్రో రైలు ప్రారంభోత్సమైన తర్వాత రోజుకు కనీసం లక్ష మంది మెట్రోరైలులో ప్రయాణం చేస్తున్నారు. మెట్రోరైలులో ఇలా చేస్తే జైలుకే, మియాపూర్‌ టూ అమీర్‌పేటకు మోడీ, కెసిఆర్ అయితే హైద్రాబాద్ మెట్రో రైల్వే స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. పుట్‌పాత్‌లపైనే వాహనాలను పార్కింగ్ చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. మెట్రోలో ప్రయాణంతో త్వరగా గమ్యస్థానాలకు మెట్రో రైలులో ప్రయాణం చేయడంతో గమ్యస్థానాలకు తక్కువ సమయంలోనే చేరుకొనే అవకాశం దక్కుతోంది. ప్రస్తుతం నాగోల్- అమీర్‌పేట మార్గంలో మెట్రో రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే నాగోల్ నుండి అమీర్‌పేటకు సుమారు 45 నిమిషాల సమయం పడుతోంది. టిక్కెట్టు తీసుకొంటే రూ.45.స్మార్ట్ కార్డు ద్వారా టిక్కెట్టు కొనుగోలు చేస్తే రూ.42 చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా మెట్రోలో అమీర్‌పేటకు చేరుకోవచ్చు. బస్సులో నాగోల్‌ నుండి అమీర్ పేటకు ఆర్టీసీ బస్సులో నాగోల్ నుండి అమీర్‌పేట వెళ్ళేందుకు డైరెక్ట్ బస్సులో లేవు. సికింద్రాబాద్‌కు వచ్చి అక్కడి నుండి అమీర్‌పేటకు వెళ్లే బస్సు ఎక్కాల్సి ఉంటుంది. అయితే రెండు బస్సులు మారాలి. రెండు బస్సుల ఛార్జీలను కలుపుకొంటే సుమారు 27 నుండి 30 రూపాయాలు ఖర్చు అవుతోంది. అంటే మెట్రో రైల్ ఛార్జీలతో పోలిస్తే సుమారు 15 రూపాయాలు తక్కువ. కానీ, సుమారు గంటకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ట్రాఫిక్ కష్టాలు తప్పవు ఆర్టీసి బస్సులో ప్రయాణం చేస్తే ట్రాఫిక్ జామ్‌లతో కష్టాలు తప్పవు. నగరంలో ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోందో అర్ధం కాని పరిస్థితి. ట్రాఫిక్ జామ్ అయితే ఎప్పుడు ట్రాఫిక్ క్లియర్ అవుతోందో తెలియని పరిస్థితి. మరో వైపు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కనీసం నిమిషం , అర నిమిషం బస్సు ఆగాల్సిందే. మెట్రో రైలులో ట్రాఫిక్ కష్టాలుండవు మెట్రో రైలులో ప్రయాణం చేస్తే ట్రాఫిక్ కష్టాలుండవు. ప్రతి స్టేషన్‌లో సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు రైలు ఆగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలోనే రైలు గమ్యస్థానానికి చేరుకొంటుంది. సమయానుకూలంగా గమ్యస్థానాలకు చేరుకొంటారు.కాకపోతే బస్సు ఛార్జీల కంటే అధికంగా చెల్లించాల్సి వస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9986
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author